నోయెల్ నామకరణం, అన్నప్రాసన వేడుకలో దద్దాల నారాయణ యాదవ్
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి: కనిగిరి మండలం నేలటూరి గొల్లపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరికే ప్రభాకర్–గ్లోరీ దంపతుల కుమారుడు నోయెల్ నామకరణం, అన్నప్రాసన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి నోయెల్‌కు అన్నప్రాసన నిర్వహించి ఆశీర్వదించారు. చిన్నారి ఆరోగ్యంగా, సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.