నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ దద్దాల
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
వివాహ వేడుకలో పాల్గొన్న దద్దాల నారాయణ యాదవ్
కనిగిరి: కనిగిరి మండలం నేలటూరి గొల్లపల్లి పంచాయతీ పరిధిలో వైఎస్సార్‌సీపీ నాయకులు పెరికె ఇసాక్–నయోమి దంపతుల కుమారుడు పీటర్ ప్రసన్నకుమార్, అరుణిమ వివాహ వేడుకలో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను దద్దాల నారాయణ యాదవ్ ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.