ఉరుమడ్లలో గణనాథుని శోభాయాత్రలో పాల్గొన్న డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, చిట్యాల మండల సోషల్ మీడియా ఇన్‌చార్జి పట్ల జనార్దన్, వార్డు సభ్యుడు గంగాపురం రాము, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్దన్, భక్తులు, మహిళలు, యువకులు, కాలనీవాసులు, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.