BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:35 pm
Posted by : K MAHESH

షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహార నియమాలు పాటించాలి

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:35 PM
18 వీక్షణలు

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే.. విసెరల్ ఫ్యాట్‌తో జీవక్రియ సంబంధిత సమస్యలు

డాక్టర్ కేసోజు భరత్ బాబు, ఎండీ జనరల్ మెడిసిన్, ప్రశాంతి హాస్పిటల్ అధినేత

కురవి, నవంబర్ 21: మధుమేహం (షుగర్) ఉన్నవారు ఆహారపు అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ వైద్యుల సూచనల మేరకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఖమ్మంలోని ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, ఎండీ జనరల్ మెడిసిన్ వైద్య నిపుణుడు డాక్టర్ కేసోజు భరత్ బాబు సూచించారు. రక్తంలో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉన్నా, సాధారణ స్థాయి కంటే తగ్గినా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా షుగర్ స్థాయిలు మరీ తగ్గితే అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం కూడా ఉంటుందని వివరించారు.

శనివారం తొవ్వ న్యూస్ ప్రతినిధితో మాట్లాడిన ఆయన మధుమేహం, దాని లక్షణాలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు ఎదురయ్యే సమస్యలు, విసెరల్ ఫ్యాట్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి వివరించారు.

షుగర్ వ్యాధి అంటే ఏమిటి?

డయాబెటిస్‌గా పిలిచే మధుమేహం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంతగా లేకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను శరీరం సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య అని డాక్టర్ భరత్ బాబు తెలిపారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహాలతో నియంత్రణలో ఉంచుకోవడం అవసరమని పేర్కొన్నారు.

షుగర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?

మధుమేహం ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలను ఆయన వివరిస్తూ.. తరచూ మూత్ర విసర్జన చేయడం, అధికంగా దాహం వేయడం, చూపు మందగించడం, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చని తెలిపారు. కొంతమందిలో ఆకలి ఎక్కువగా వేయడం, సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు కూడా ఉంటాయని చెప్పారు.

షుగర్ ఎక్కువైతే ఏమవుతుంది?

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణ పరిమితిని మించి పెరిగిన పరిస్థితిని హైపర్‌గ్లైసీమియా అంటారని డాక్టర్ వివరించారు. అధిక దాహం, ఎక్కువ ఆకలి, అలసట, తరచూ మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపించవచ్చని తెలిపారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం దీర్ఘకాలం కొనసాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అదే విధంగా షుగర్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గినప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, తీవ్రమైన పరిస్థితుల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

షుగర్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలను క్రమబద్ధంగా పాటించాలని డాక్టర్ భరత్ బాబు సూచించారు. తీపి పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని, మటన్ వంటి మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండాలని, చేపలు, చికెన్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, షుగర్ స్థాయిలను బట్టి ఆహార నియమాలు మారుతాయని, వైద్యుల సూచనల మేరకు ఆహార ప్రణాళిక రూపొందించుకోవడం మంచిదని పేర్కొన్నారు.

అలాగే రోజువారీ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని, రోజుకు కనీసం నాలుగు కిలోమీటర్ల వరకు నడవాలని సూచించారు. ఆహార నియంత్రణ, నడక, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని వివరించారు.

విసెరల్ ఫ్యాట్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

విసెరల్ ఫ్యాట్ అంటే పొట్టలోని అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వు కణజాలమని డాక్టర్ భరత్ బాబు వివరించారు. చేతులు, కాళ్లు లేదా చర్మం కింద కనిపించే కొవ్వుతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని తెలిపారు. శరీరంలోని అంతర్గత అవయవాల చుట్టూ అధికంగా పేరుకుపోయే ఈ కొవ్వు జీవక్రియ సంబంధిత సమస్యలకు, దీర్ఘకాలిక వాపు ప్రక్రియలకు కారణమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారిలో విసెరల్ ఫ్యాట్ నిల్వలు పెరిగే అవకాశం ఉంటుందని, దీనివల్ల జీవక్రియలో మార్పులు చోటుచేసుకుని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వివరించారు. విసెరల్ ఫ్యాట్ పెరుగుదల మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలతో సంబంధం కలిగి ఉంటుందని తెలిపారు. అందువల్ల శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం అవసరమని సూచించారు.

ప్రశాంతి హాస్పిటల్‌లో వివిధ వైద్య సేవలు

ఖమ్మంలోని ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ భరత్ బాబు తెలిపారు. ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో పాటు రోగులకు నిరంతరం సేవలు అందించే సిబ్బంది, డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు.

అలాగే జర్నలిస్టులకు తమ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు, చికిత్సలు పొందాలని ఈ సందర్భంగా డాక్టర్ కేసోజు భరత్ బాబు సూచించారు.