వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి: ప్రత్యేకాధికారి రాజశేఖర్
మునగపాక: గ్రామాల్లో నెలకొనే సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మండల ప్రత్యేకాధికారి రాజశేఖర్ సూచించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఎంఎల్‌సీసీ కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం గ్రామానికి సంబంధించిన ఓ వివాదంపై ఇరు వర్గాల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో వివాదాలకు తావులేకుండా సోదరభావంతో మెలగాలని సూచించారు. సమస్యలు తలెత్తినప్పుడు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ ఎ. సంధ్య, డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.