సెంట్రల్ లైబ్రరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్
తెలంగాణ
/
హన్మకొండ
హన్మకొండ జిల్లా: స్థానిక సెంట్రల్ లైబ్రరీని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీలో పూర్తయిన రీడింగ్ హాల్ పనులను పరిశీలించారు.
అనంతరం లైబ్రరీలోని మౌలిక సదుపాయాలు, పుస్తకాల నిర్వహణ, ఇంటర్నెట్ సెక్షన్‌ను పరిశీలించారు. పాఠకులకు పుస్తకాలు అందించే విధానం, పుస్తకాలను తీసుకునే ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
లైబ్రరీకి వచ్చే పాఠకులకు మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.