BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 13 October 2026, 09:42 pm
Posted by : KOLA MAHESH

గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
13 Oct, 2026 - 09:42 PM
10 వీక్షణలు

సంస్థాన్ నారాయణపురం: గ్రామ అభివృద్ధిలో భాగంగా నూతనంగా నిర్మించనున్న మార్కెట్ రోడ్డు కోసం దోమలపల్లి హకీమ్ స్వామి మనవళ్లు తమ సొంత ఇంటి స్థలాన్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. సుమారు 371 గజాల స్థలాన్ని రోడ్డు నిర్మాణానికి కేటాయించేందుకు అంగీకరించారు.

సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి పనులపై చర్చించగా, దోమలపల్లి హకీమ్ స్వామి మనవళ్లు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్, వినోద్ కుమార్, శ్రీకాంత్, సురేష్ గ్రామ ప్రయోజనాల కోసం తమ స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు.

ఈ రోడ్డు గ్రామంలోని సూర పెద్ద రాజయ్య ఇంటి పక్క నుంచి బురుజు గొడ వరకు 18 అడుగుల వెడల్పుతో నిర్మించి మార్కెట్‌కు అనుసంధానం చేయనున్నారు. గ్రామ అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా స్థలాన్ని అందించిన కుటుంబానికి సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, గ్రామ పాలకవర్గం, గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

దోమలపల్లి హకీమ్ స్వామి జ్ఞాపకార్థం ఈ రోడ్డుకు ఆయన పేరు పెట్టి, కమాన్ ఏర్పాటు చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. అనంతరం స్థలాన్ని అందించేందుకు ముందుకొచ్చిన మనవళ్లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నర్సింహ, వార్డు సభ్యులు సూరపల్లి వెంకటేష్, బలుగూరి శివ, మండల కాంగ్రెస్ కార్యదర్శి రాచకొండ రమేష్ బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉప్పల రాజయ్య, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, పల్లె ఆనంద్ గౌడ్, కారోబార్ పున్నం యాదగిరి, కాలనీవాసులు శికిలామెట్ల ప్రభాకర్, రాములు, శివప్రసాద్, యువజన కాంగ్రెస్ నాయకుడు బానోతు కిరణ్ నాయక్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.