BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 07 October 2026, 11:18 pm
Posted by : V శ్రీనివాస్

వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవద్దు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 11:18 PM
93 వీక్షణలు

మంచిర్యాల :​సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, సందేశాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. అక్టోబర్ జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన 'సైబర్ జాగ్రూకత దివస్' సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సైబర్ భద్రత పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఆర్థిక విషయాలను బహిరంగంగా పంచుకోవడం వల్ల సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేస్తారని హెచ్చరించారు. 'పాజ్ ఫర్ సేఫ్టీ – పాజ్ థింక్ వెరిఫై' నినాదంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

​మంచిర్యాల జోన్ డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందంతో పాటు మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, సైబర్ క్రైమ్ ఏసీపీ డి.వి. రంగారెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు, రామగుండం సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు