BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:37 pm
Posted by : కూనురు మధు

డ్రైవర్ల అప్రమత్తతే ప్రమాదాల నివారణకు ప్రధాన ఆయుధం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
07 Oct, 2026 - 06:37 PM
2 వీక్షణలు

డ్రైవర్ల అప్రమత్తతే ప్రమాదాల నివారణకు ప్రధాన ఆయుధం : ఎస్పీ శరత్ చంద్ర పవార్

NTODAY NEWS : చిట్యాల

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారుల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్వేజన ఫౌండేషన్ సహకారంతో బుధవారం చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఎన్‌హెచ్–65 జాతీయ రహదారిపై భారీ వాహనాలు, లారీల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, చూపు లోపాలు ఉన్న వారికి వైద్యుల సూచనల మేరకు ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారీ వాహనాల డ్రైవర్లు ఎక్కువ దూరం, ఎక్కువ సమయం ప్రయాణిస్తుండటంతో కంటి అలసట, చూపు మందగించడం, నిద్రలేమి, శారీరక అలసట వంటి సమస్యలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందన్నారు. డ్రైవర్లు కంటి చూపును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డిఫెన్సివ్ డ్రైవింగ్ కీలకమని ఎస్పీ తెలిపారు. ఇతర వాహనదారుల తప్పిదాలను ముందుగానే ఊహిస్తూ ప్రమాదకర పరిస్థితులను గుర్తించి వేగాన్ని నియంత్రించడం, సురక్షిత దూరం పాటించడం, అవసరమైనప్పుడు బ్రేకులు వేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రహదారి పరిస్థితులు, మలుపులు, పాదచారులు, ఇతర వాహనాలను నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలన్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రాత్రివేళ హైవేలపై భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, అలసటగా అనిపిస్తే వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో నిలిపి విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని తెలిపారు. గత ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 350 మంది ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు హెల్మెట్ ధరించకపోవడం కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధన కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచం అని అన్నారు. రోడ్డుపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. భారీ వాహనాల డ్రైవర్ల కోసం నిర్వహించిన కంటి వైద్య శిబిరం రోడ్డు భద్రతకు ఎంతో ఉపయోగకరమని  పేర్కొన్నారు .ఈ  కార్యక్రమానికి సహకరించిన సర్వేజన ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కే. శివరాం రెడ్డి, ఎస్‌బీ సీఐ నాగరాజు, ఎస్‌ఐలు వెంకట్ రెడ్డి, విష్ణు, డీటీఆర్‌బీ రిటైర్డ్ సీఐ అంజయ్య, స్థానిక సర్పంచ్ బొంత చంద్రారెడ్డి, సర్వేజన ఫౌండేషన్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్, డాక్టర్ ప్రదీప్, పోలీస్, వైద్య సిబ్బంది, లారీ అసోసియేషన్ సభ్యులు, భారీ వాహనాల డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.