ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం జేనువకొండకు చెందిన వేణు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం పావులూరికి చెందిన వ్యవసాయ పొలంలో గొర్రు తోలేందుకు ట్రాక్టర్‌తో వెళ్లాడు.
పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి వేణు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పొలంలో ఎవరూ లేకపోవడంతో ఘటనకు దారితీసిన కారణాలపై స్పష్టత లేదని పేర్కొన్నారు.
వేణు మృతితో జేనువకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.