పర్యావరణహితమైన పోలింగ్ కేంద్రాలు సిద్ధం
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
పోలింగ్ కేంద్రాల వద్ద పచ్చని మొక్కలు,పూలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే బొమ్మలరామారం,ఆలేరు, ఆత్మకూరు,రాజాపేట,తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలల్లో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.బొమ్మలరామారం మండలంలోని ఫకీర్ గూడెం గ్రామం, ఆలేరు మండలంలోని శారాజిపేట గ్రామం,ఆత్మకూరు మండలం సర్వేపల్లి,రాజాపేట మండలం నర్సాపూర్,యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. అందులో భాగంగా పోలింగ్ కేంద్రంలో ప్లాస్టిక్స్ రహిత వస్తువులను ఉపయోగించడం,పోలింగ్ కేంద్రం ఎంట్రెన్స్ లో పూలతో అలంకరణ, బయట నుండి బూత్ వరకు పచ్చని మొక్కలు,కొబ్బరి మట్టలతో అలంకరణ ఏర్పాటు చేయడం. వృద్ధులకి, దివ్యాంగులకు వీల్ ఛైర్ సౌకర్యం కల్పించడం.చిన్న పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయడం, లంచ్ సమయంలో ప్లాస్టిక్ ప్లేట్ కి కాకుండా అరటి ఆకులు లేదా ఎండు విస్తరాకులు వాడాలని చెప్పడం జరిగింది అని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ చెప్పారు .గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రంలో భాగంగా ఆలేరు మండలం శారాజీ పేట గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి అని చెప్పారు.ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చే ఓటర్లకి పూల మొక్కలతో స్వాగతం పలకాలని సూచించారు. ఓటర్ ల పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు.














