BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 07 October 2026, 10:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పట్టభద్రుల ఓట్ల నమోదుకు కృషి చేయాలి: లింగాల కమల్‌రాజు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 10:38 PM
45 వీక్షణలు

మధిర: పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని, అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు జరిగేలా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని మాజీ జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు పిలుపునిచ్చారు.

మధిరలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా గ్రామాలు, పట్టణాల్లో పార్టీ శ్రేణులు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రతి గ్రామంలో పట్టభద్రుల వివరాలను సేకరించి, ఓటు నమోదు ప్రక్రియపై వారికి అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. అర్హత ఉన్న ఒక్క పట్టభద్రుడి ఓటు కూడా నమోదు కాకుండా మిగలకుండా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కమల్‌రాజు కోరారు.

ఈ సమావేశంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిత్తారు నాగేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు పల్లబోతు వెంకటేశ్వరరావు, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బొగ్గుల భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ చావా వేణుబాబు, సర్పంచ్‌ కంచం గోపి, కౌన్సిలర్‌ వై.వి. అప్పారావు, ఉమామహేశ్వర్‌రెడ్డి, ఆళ్ల నాగబాబు, వంకాయలపాటి నాగేశ్వరరావు, భువనగిరి నారాయణ, వేల్పుల శివ, ముత్తవరపు ప్యారి, పరిష శ్రీనివాసరావు, చీదిరాళ్ల రాంబాబు, పల్లపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.