దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
విజయవాడ: ఈ నెల 11 నుంచి 22వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఉత్సవ ప్రాంతాన్ని వివిధ సెక్టార్లుగా విభజించి పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, కంట్రోల్ రూమ్, ఉచిత చప్పల్ స్టాండ్లు, క్లోక్ రూములు, డ్రోన్ పర్యవేక్షణ తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దసరా ఉత్సవాల సందర్భంగా సిబ్బంది డిప్లాయ్‌మెంట్, విధుల నిర్వహణ, పర్యవేక్షణ, వివిధ విభాగాల మధ్య సమన్వయానికి అదనపు కమిషనర్ (జనరల్) ఎ. రవీంద్రరావుకు బాధ్యతలు అప్పగించినట్లు కమిషనర్ తెలిపారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ సి.హెచ్. నిర్మల గ్లోరీ పర్యవేక్షణలో కొండ దిగువ ప్రాంతంలోని వినాయక ఆలయం నుంచి కుమ్మరిపాలెం వరకు, చినరాజగోపురం నుంచి టోల్‌గేట్ వరకు పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించనున్నారు. ఘాట్ల వద్ద భక్తులు వదిలే వస్త్రాలను ఎప్పటికప్పుడు సేకరించి తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి పర్యవేక్షణలో తొమ్మిది ప్రాంతాల్లో మొత్తం 150 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. హోల్డింగ్ ఏరియాలో 40, బస్టాండ్ ప్రాంతంలో 10, రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో 10, ధోబీ ఘాట్, కృష్ణవేణి ఘాట్ వద్ద 10, టీటీడీ సైడ్ పార్కింగ్ ప్రాంతంలో 10, పున్నమిఘాట్ పార్కింగ్ ప్రాంతంలో 30, కెనాల్ రోడ్డులో 10, భవానీ ఘాట్ వద్ద 20, అదనంగా మరో 10 మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
దోమల నివారణకు అన్ని ఉత్సవ ప్రాంతాల్లో ఫ్యూమిగేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని బయాలజిస్ట్ డాక్టర్ డి.ఆర్.సి. సూర్యకుమార్ సూచించారు. దోమల నియంత్రణ చర్య