BREAKING
thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ
Test 4
Date of Publish : 06 November 2026, 07:40 pm
Posted by : K MAHESH

జనవిజ్ఞాన వేదిక గార్ల మండల నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:40 PM
6 వీక్షణలు

అధ్యక్షుడిగా మాచర్ల సుందర్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గంగావత్ వీరన్న ఏకగ్రీవ ఎన్నిక

మహబూబాబాద్, నవంబర్ 6 (ఎన్ టుడే న్యూస్): జనవిజ్ఞాన వేదిక (జెవివి) గార్ల మండల నూతన అధ్యక్షుడిగా మాచర్ల సుందర్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గంగావత్ వీరన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం గార్ల మండలంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి మాచర్ల సుందర్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఆర్.వి. ప్రసాద్ రావు మాట్లాడుతూ సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించేందుకు జనవిజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రోజురోజుకూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు కొనసాగడం ఆందోళనకరమని అన్నారు.

ప్రజలు ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించి, వాస్తవాలను తెలుసుకునే అలవాటు పెంచుకోవాలని సూచించారు. మూఢనమ్మకాల వల్ల సమాజంలో ఏర్పడే అపోహలను తొలగించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ దిశగా జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీలో మండల గౌరవ అధ్యక్షులుగా ఎడ్ల అప్పయ్య, మాలోత్ శివ, ఉపాధ్యక్షులుగా జబ్బ వీరాస్వామి, కార్యదర్శులుగా పల్లె వెంకటరెడ్డి, ఎట్టి రాము దొర, ఎం. వెంకటరమణ ఎన్నికయ్యారు.

అలాగే చెకుముకి కన్వీనర్‌గా బానోత్ రమేష్, సమతా కన్వీనర్‌గా చింత మౌనిక, సాంస్కృతిక కన్వీనర్‌గా వంగూరి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్‌గా భూక్య శివకృష్ణ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జనవిజ్ఞాన వేదిక ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.