BREAKING
thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
Test 4
Date of Publish : 06 November 2026, 08:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Nov, 2026 - 08:07 PM
26 వీక్షణలు

ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై పోలీస్ అధికారుల సమీక్ష

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, నవంబర్ 6: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ పరిశీలించారు. శుక్రవారం తిరువూరు పట్టణంలోని వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు, తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గురు ప్రకాష్, తిరువూరు ఎస్‌ఐ శాతకర్ణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు నిర్వహణకు అనువుగా ఉన్న వసతులు, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగేలా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భద్రతను పటిష్టం చేయడంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ పోలీస్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.