BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 02:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గద్వాల్‌లో రూ.60 వేల లంచం తీసుకుంటూ విద్యుత్ అధికారి ఏసీబీకి పట్టుబాటు

తెలంగాణ
/ జోగులాంబ గద్వాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Nov, 2026 - 02:53 PM
25 వీక్షణలు

రూ.12.62 లక్షల పనుల బిల్లు మంజూరుకు లంచం డిమాండ్.. కారు డాష్‌బోర్డ్‌పై నగదు పెట్టించిన అధికారి తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ మరోసారి కొరడా ఝుళిపించింది. కాంట్రాక్టర్‌కు సంబంధించిన పనుల బిల్లును మంజూరు చేసి, చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.60 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న విద్యుత్ శాఖ అధికారిని మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్‌పీడీసీఎల్) గద్వాల్ సబ్‌డివిజన్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అన్నారపు రమేష్ బాబు, ఫిర్యాదుదారుడు తన సహ కాంట్రాక్టర్‌తో కలిసి చేసిన రూ.12,62,070 విలువైన పనులకు సంబంధించిన బిల్లును క్లియర్ చేసేందుకు రూ.60 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. బిల్లు మంజూరు చేసి, తదుపరి ప్రక్రియ పూర్తి చేసినందుకు ప్రతిఫలంగా ఈ మొత్తాన్ని ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో నవంబర్ 26, 2026న మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చు బిగించారు. విధులు ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరిన సమయంలో అధికారి కాంట్రాక్టర్‌ను సంప్రదించి రూ.60 వేల నగదును తన కారు డాష్‌బోర్డ్‌పై ఉంచాలని సూచించినట్లు ఏసీబీ తెలిపింది. అధికారి చెప్పినట్లుగానే ఫిర్యాదుదారుడు నగదును డాష్‌బోర్డ్‌పై ఉంచగా, అప్పటికే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అధికారి ఉపయోగిస్తున్న ఏపీ07సీజెడ్4705 నంబరు గల కారులోని డాష్‌బోర్డ్‌పై రసాయన పరీక్షలు నిర్వహించగా సానుకూల ఫలితం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా ఆర్థిక ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. అరెస్టు.. ప్రత్యేక కోర్టుకు తరలింపు లంచం కేసులో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అన్నారపు రమేష్ బాబును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించే ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల బిల్లుల మంజూరుకు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.