BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 01:13 pm
Posted by : MUSUGU GOPI

ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
22 Nov, 2026 - 01:13 PM
25 వీక్షణలు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం

నామినేషన్ల దాఖలుకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దు.. పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక స్వపరిపాలన వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహించే ఎన్నికలని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ చట్టబద్ధంగా నామినేషన్ దాఖలు చేసి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకునే హక్కు ఉంటుందని తెలిపారు.

జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలను పార్టీకి చెందిన ఇతర నాయకులు ఎవరూ అడ్డుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని సూచించారు.

మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్థానాల పంపకాలు ఉండవని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించడమే తమ ఉద్దేశమని పార్టీ వైఖరిని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చని పార్టీ అధినేత స్పష్టం చేసినట్లు సమాచారం.