BREAKING
thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
Date of Publish : 02 October 2026, 05:23 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
02 Oct, 2026 - 05:23 PM
14 వీక్షణలు

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి

​– ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

​ధర్మపురి, ఎన్ టుడే న్యూస్ 

జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, పరిశుభ్రత, సమాజసేవ వంటి ఆశయాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరించాలని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్  వేముల నాగలక్ష్మి పిలుపునిచ్చారు.

​గాంధీ జయంతిని పురస్కరించుకొని ధర్మపురి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, మున్సిపల్ కమిషనర్ శ్రీ మామిళ్ల శ్రీనివాసరావు సమక్షంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అహింసా మార్గంలో దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం, ఆయన అందించిన నైతిక విలువలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ధర్మపురి పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది అంతా సమన్వయంతో కృషి చేయాలని కోరారు.

​అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు, పురప్రముఖులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంట సుధాకర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పిన్న శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పురప్రముఖులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.