వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
తమిళనాడు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళకు సంబంధించిన ఘటన తమిళనాడులోని తెన్‌కాసి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. రెహమాన్, అంసా నిషా దంపతులు శ్రీవిల్లిపుత్తూరులో ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నారు. తరచూ ఓ రెస్టారెంట్‌కు వెళ్లే క్రమంలో నిషాకు అక్కడ ఇంద్రకుమార్‌తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు పేర్కొన్నారు.
కొంతకాలంగా రెహమాన్‌కు పని లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడని, దీంతో తమ సంబంధానికి ఆయన అడ్డుగా ఉన్నాడని భావించిన నిషా.. ప్రియుడు ఇంద్రకుమార్‌తో కలిసి హత్యకు పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
పథకం ప్రకారం రెహమాన్‌ను కారులో తీసుకెళ్లిన ఇంద్రకుమార్.. తెన్‌కాసి జిల్లా పాన్‌మోళి ప్రాంతంలోని ఓ తోట వద్ద అతడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి అదే కారులో తిరిగి వెళ్లినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు.
సుమారు పది రోజుల తర్వాత తోటలో కుళ్లిన స్థితిలో రెహమాన్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించినట్లు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో నిషా, ఇంద్రకుమార్ కలిసి రెహమాన్‌ను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.