నేత్రదానం – మహాదానం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం: మండలంలోని అమ్మిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన యరమల లక్ష్మారెడ్డి (74) అక్టోబర్ 7న సాయంత్రం 5 గంటలకు మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
లక్ష్మారెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ సభ్యుడు గోగిరెడ్డి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఈ సందర్భంగా నేత్రదానం ఆవశ్యకత, ప్రాధాన్యతను కుటుంబ సభ్యులకు వివరించారు. కుటుంబ సభ్యులు అంగీకరించడంతో లక్ష్మారెడ్డి నేత్రాలను నేత్రదానంగా అందించారు.
మృతుని నుంచి సేకరించిన కార్నియాలను విజయవాడలోని ఎల్.వి. ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు అందజేశారు. నేత్రదానం ద్వారా మరణానంతరం కూడా మరో ఇద్దరికి చూపును అందించే అవకాశం ఉంటుందని, కుటుంబ సభ్యులు చూపిన మానవతా దృక్పథం అభినందనీయమని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.