BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 10:00 pm
Posted by : P GAJENDRA BABU

రైతు సంఘం నాయకుడు పేరం కృష్ణమూర్తి నాయుడు మృతి

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency
27 Oct, 2026 - 10:00 PM
17 వీక్షణలు

బుచ్చినాయుడు కండ్రిగ(తిరుపతి జిల్లా) | ఎన్‌ టుడే న్యూస్‌:

తిరుపతి జిల్లా బి.ఎన్‌.కండ్రిగ మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన ప్రముఖ రైతు సంఘం నాయకుడు పేరం కృష్ణమూర్తి నాయుడు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణంతో గ్రామంలోనూ, మండల పరిధిలోని రైతు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.

విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మంగళవారం ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కృష్ణమూర్తి నాయుడు చేసిన పోరాటాలను, రైతు సంఘానికి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు.

సీపీఐ నాయకుల నివాళి

నివాళులర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు జనమాల గురవయ్య, కత్తి రవి, బి.ఎన్‌.కండ్రిగ మండల కార్యదర్శి కత్తి ధర్మయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షురాలు చారులత తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని పేరం కృష్ణమూర్తి నాయుడికి కన్నీటి నివాళులర్పించారు.