BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:53 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:53 PM
21 వీక్షణలు

అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబ యజమానులు దరఖాస్తు చేసుకోవాలి: కౌన్సిలర్లు పురం రాజమణి రమేష్, పాయిరాల శరత్

కేసముద్రం, నవంబర్ 21:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని కేసముద్రం మున్సిపాలిటీ ఐదవ వార్డు కౌన్సిలర్ పురం రాజమణి రమేష్, ఆరో వార్డు కౌన్సిలర్ పాయిరాల శరత్ అన్నారు. కుటుంబ యజమాని మరణించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఆదుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

శనివారం కేసముద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న రూ.5 లక్షల జీవిత బీమా భరోసాను అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దరఖాస్తుల నమోదు కోసం కుటుంబ యజమాని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రత్యేకంగా దరఖాస్తులు లేదా జిరాక్స్ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని వివరించారు. అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బీమా పథకంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సోలాపురపు యాకూబ్ రెడ్డి, తరాల విజయ్ కుమార్, దండు శ్రీను, కొనకటి మహేందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.