మొదటి దశ ఎన్నికలు ప్రశాంతం
NTODAY NEWS: బొమ్మలరామారం
పలు గ్రామ పంచాయతీలను సందర్శించిన భువనగిరి డిసీపీ ఆకాంక్ష్ యాదవ్
మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న యాదగిరిగుట్ట, ఆలేరు, బొమ్మలరామారం,ఆత్మకూరు (ఎం), రాజాపేట,తుర్కపల్లి మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఐపిఎస్ సందర్శించారు.అనంతరం ఎన్నికలు జరుగుతున్న పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పర్యవేక్షించడంలో పోలీస్ యంత్రాంగం సక్సెస్ అయిందని,పోలీసులకి స్థానికులు సహకరించడాన్ని ఆయన అభినందించారు.ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా,నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు,సిబ్బందికి ఆయన సూచించారు.
రాచకొండ పరిధిలో నిషేధాజ్ఞలు
గ‌్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 25 పోలీస్ స్టేషన్ల పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు విధించారు.14న భువనగిరి,బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట,వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలింగ్ స్టేషన్ ల వద్ద,17నగుండాల,మోటకొండూరు,చౌటుప్పల్, నారాయణపూర్, మోత్కూర్, అడ్డగూడూరు,కందుకూరు, మహేశ్వరం,ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం,మాడ్గుల్, గ్రీన్ ఫార్మా, మాడ్గుల్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పోలింగ్ స్టేషన్ ల వద్ద ఎన్నికల దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 163 bns (144 సెక్షన్) విధిస్తున్నట్టు వెల్లడించారు. ఓటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో నలుగురికి మించి గుమిగూడరాదని స్పష్టం చేశారు.














