BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 13 October 2026, 08:26 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Oct, 2026 - 08:26 PM
106 వీక్షణలు


* జాతీయ రహదారి పక్కన హోటల్‌లో పప్పు నిల్వలపై అనుమానాలు.. ల్యాబ్‌కు నమూనాల 

నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంతో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా జాతీయ రహదారి పక్కన ఉన్న ఫుడ్ 7 మిడ్డే ఫుడ్ ప్లాజాలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్‌లో నిల్వ ఉంచిన పచ్చ పెసరపప్పులో పురుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. పప్పు నాణ్యతపై అనుమానాలు వ్యక్తం కావడంతో అనుమానాస్పద నిల్వల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్లు తెలిసింది. ల్యాబ్‌ నివేదిక వచ్చిన తర్వాత పప్పు నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల విషయం తెలుసుకున్న చిట్యాల పట్టణంలోని పలువురు చిన్న వ్యాపారులు తమ హోటళ్లు, బేకరీలను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. అధికారుల తనిఖీల నేపథ్యంలో స్థానిక వ్యాపార వర్గాల్లో చర్చ నెలకొంది. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా అధికారులు తనిఖీలను కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. ఆహార పదార్థాల నిల్వ, నాణ్యత, పరిశుభ్రత విషయంలో హోటల్‌ నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.