BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 07:09 pm
Posted by : K MAHESH

విద్యార్థినులకు ధైర్యం, భరోసా కల్పించేందుకు గురుకుల పాఠశాలను సందర్శించిన జి. సబిత

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / అడ్డగూడూరు
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 07:09 PM
15 వీక్షణలు

బాలల హక్కులు, పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన

విద్యార్థుల భద్రత, రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: సీనియర్ సివిల్ జడ్జి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 21:

అడ్డగూడూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను రామన్నపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత సందర్శించారు. ఇటీవల ఈ గురుకుల విద్యాసంస్థలో బాలికల పట్ల వంట మనిషి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో విద్యార్థినుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి, వారికి ధైర్యం, భరోసా కల్పించేందుకు ఆమె ఈ పర్యటన చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా, బాధ్యులపై పోలీసు శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అడ్డగూడూరు స్థానిక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, శిశు అభివృద్ధి మరియు సంరక్షణ అధికారితో కలిసి జి. సబిత పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా బాలల హక్కులు, పోక్సో చట్టం, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. బాలికలు తమ భద్రతకు సంబంధించిన విషయాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా వెంటనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జి. సబిత సూచించారు. విద్యార్థుల రక్షణ కోసం చట్టాలు అండగా ఉంటాయని, సమస్యలను దాచిపెట్టకుండా ధైర్యంగా తెలియజేయాలని భరోసా ఇచ్చారు.

విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం పాఠశాల యాజమాన్యంతో పాటు ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా, తమకు ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా వెల్లడించేలా అవగాహన కలిగి ఉండాలని సూచించారు.