నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నంద్యాల: నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, నేరాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి, నేరాల నియంత్రణకు చర్యలు చేపడతామని సీఐ పేర్కొన్నారు.