BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 26 November 2025, 08:48 am
Posted by : NTODAY NEWS OFFICIAL

GI & SAHI ఏజెంట్లపై GST భారాన్ని తొలగించాలంటూ GIAFI డిమాండ్

తెలంగాణ
26 Nov, 2025 - 08:48 AM
362 వీక్షణలు

GI & SAHI ఏజెంట్లపై GST భారాన్ని తొలగించాలంటూ GIAFI డిమాండ్.

వివరాలు వెల్లడించిన ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాహుల్ సుధాకర్. NTODAY NEWS: ఎల్బీనగర్  హైదరాబాద్: జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఇంటిగ్రేటెడ్ (GIAFI) GI & SAHI ఏజెంట్లపై పడుతున్న GST భారం తక్షణమే ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాపై ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాపోలు సుధాకర్, చీప్ అడ్వైజర్ శ్రీనివాస చారి సోమాజిగూడ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడి, డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏజెంట్ల కమిషన్లపై 18% GST విధించడం వల్ల వేలాది మంది ఏజెంట్లు ఆర్థికంగా నష్టపోతున్నారని ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ తీవ్రంగా విమర్శించారు. ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్నట్లు, కంపెనీలు Input Tax Credit పేరుతో GSTని తిరిగి పొందుతున్నప్పటికీ, అదే పన్నును ఏజెంట్ల కమిషన్‌ నుంచి కట్ చేయడం hidden tax లాంటిదని ఆరోపించారు. ఆరోగ్య బీమా వంటి ప్రజా ప్రయోజన సేవలపై పన్ను వేయడం ప్రజలకు భారమవుతోందని, హెల్త్ ఇన్సూరెన్స్ పై GST ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యం సాధ్యంకావాలంటే బీమా ఏజెంట్లను బలోపేతం చేయాలని, GST భారంతో ఏజెంట్లు కుంగిపోతే బీమా రంగం అభివృద్ధి మందగిస్తుందని ఫెడరేషన్ హెచ్చరించింది. IRDAI తీసుకుంటున్న కొన్ని తాజా నిర్ణయాలు కూడా ఏజెంట్లకు, వినియోగదారులకు అనుకూలంగా లేవని వారు అభిప్రాయపడ్డారు. ఏజెంట్ల కమిషన్లపై GST రద్దు చేసి, బీమా రంగంలో పారదర్శకతను తీసుకురావాలని GIAFI డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ శాస్త్రి, ట్రెజరర్ అనురాధ .వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube