BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:48 pm
Posted by : K MAHESH

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:48 PM
18 వీక్షణలు

కేసముద్రంలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, ముదిరాజ్ మహాసభ 13వ ఆవిర్భావ దినోత్సవం

ముదిరాజుల ఐక్యతను చాటుతూ బైక్ ర్యాలీ.. పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తాం: రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్

కేసముద్రం, నవంబర్ 21:

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ కోరారు. కేసముద్రం మండల కేంద్రంలో ముదిరాజుల ఐక్యతకు ప్రతీకగా పోరాట యోధుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, ముదిరాజ్ మహాసభ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కేసముద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ముదిరాజులు మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటుకున్నారు. అనంతరం ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు లింగాల పిచ్చయ్య మహాసభ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయా గ్రామాల అధ్యక్షులు మహాసభ జెండాలను ఆవిష్కరించారు.

తదనంతరం లింగాల పిచ్చయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ మాట్లాడుతూ.. జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న ముదిరాజులకు రాజకీయంగా తగిన అవకాశాలు లభించడం లేదని అన్నారు. ముదిరాజుల్లో ఐక్యత లోపించడం వల్లే రాజకీయ అవకాశాలను కోల్పోతున్నామని అభిప్రాయపడ్డారు. అందరూ ఐక్యంగా ఉంటూ తమ హక్కులు, రాజకీయ అవకాశాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగపరంగా బీసీ-డీ జాబితాలో ఉన్న ముదిరాజులను బీసీ-ఏ జాబితాలో చేర్చే అంశంపై సమష్టిగా పోరాడి సాధించుకోవాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో అధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

కమ్యూనిటీ భవనం, చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలి

కేసముద్రం మండల కేంద్రంలో ఇతర కుల సంఘాలకు ఉన్నట్లుగానే ముదిరాజులకు కూడా కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని నీలం దుర్గేష్ కోరారు. ఇందుకు మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే మత్స్యకారులు తాము పట్టిన చేపలను విక్రయించుకునేందుకు మండల కేంద్రంలో ప్రత్యేక చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. మత్స్యకారుల జీవనోపాధికి తోడ్పడేలా అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

మండల కేంద్రంలో ముదిరాజుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని నీలం దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు

ఈ కార్యక్రమంలో కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్ బానోతు సునీత వెంకన్న, కౌన్సిలర్లు తరాల వీరేష్, దూడపాక కృష్ణ, వల్లందాస్ ఉమా రవి, కిషోర్, నాయకులు గుగులోత్ దస్రు నాయక్, కముటం శ్రీనివాస్, రడం శ్రీను, దామర కొండ ప్రవీణ్, ముదిరాజ్ మహాసభ మండల ఉపాధ్యక్షుడు దుండి మధుకర్, జిల్లా అధికార ప్రతినిధి ఏదరబోయిన సూరయ్య, జిల్లా ఇన్‌చార్జి గుండా వెంకన్న, మెపా నాయకులు రమేష్, చిరుత వెంకటేశ్వర్లు, ముదిరాజ్ మహాసభ యూత్ ప్రెసిడెంట్ విజేందర్, ఇనుగుర్తి మండల అధ్యక్షుడు మల్లం యాకయ్య, చాగంటి రాములు, శీలం సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్, అనిల్, సంపత్, కుమార్, వీరయ్య, పాపయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ముదిరాజ్ సంఘం సభ్యులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.