BREAKING
thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు
Date of Publish : 02 October 2026, 12:07 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

గాంధీ జయంతి సందర్భంగా వెంకట్రావుపేటలో గ్రామసభ

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
02 Oct, 2026 - 12:07 PM
68 వీక్షణలు

లక్షెట్టిపేట మండలం, మంచిర్యాల జిల్లా: గాంధీ జయంతిని పురస్కరించుకొని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి  సురేష్ గారు, వారి పోలీస్ సిబ్బంది, మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ గారు హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలిమెల రాజు, ఉప సర్పంచ్ కోన తిరుమల, గ్రామ కార్యదర్శి సింగతి వంశీకృష్ణ, గ్రామ కరబరి గ్రామ వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సి ఎ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎస్ఐ గోపతి సురేష్ గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గంజాయి, మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలు, చెడు మార్గాలు, మూఢనమ్మకాలు, చేతబడి వంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి విషయాలను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.


యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా విద్య, ఉద్యోగం, క్రీడలు మరియు సమాజ సేవ వైపు అడుగులు వేయాలని ఎస్ఐ సుచించారు. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.


అలాగే గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సత్యం, అహింస, పరిశుభ్రత, శాంతి, సామాజిక ఐక్యత వంటి విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.


గ్రామసభలో గ్రామ సమస్యలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై కూడా చర్చించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.