BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 07 October 2026, 11:15 pm
Posted by : KADARI RAMANA

భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana Nirmal Rural
07 Oct, 2026 - 11:15 PM
15 వీక్షణలు

నిర్మల్: లక్ష్మణచందా మండలం న్యూ కంజర్, చామన్‌పల్లి గ్రామాల్లో భూ సమస్యలు, భూముల రీసర్వే పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న రీసర్వే పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ముందుగా న్యూ కంజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు, గ్రామస్థులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో భూముల పట్టాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో గ్రామస్థుల సహకారం కీలకమని పేర్కొన్నారు.

భూ సమస్యలపై గ్రామసభలు నిర్వహించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సమస్యను పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భూముల పట్టాలకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే గ్రామసభల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామస్థులు తెలిపే సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా అధికారులు చొరవతో పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం చామన్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన రీసర్వే పనులు, ఇంకా మిగిలి ఉన్న కమతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

రీసర్వే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సర్వే బృందాలు సంబంధిత సిబ్బంది పర్యవేక్షణలో భూ సంబంధిత కమతాల రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

భూ సమస్యల పరిష్కారం, రీసర్వే ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన రైతుల సమస్యలను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవిదాస్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో వనజ, సర్పంచులు మోహన్ రెడ్డి, లక్ష్మి, ఉప సర్పంచ్ ముత్యం గంగారెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.