BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 06:19 pm
Posted by : కూనురు మధు

జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలకు గ్రీన్ గ్రోవ్ విద్యార్థుల ఎంపిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
21 Sep, 2026 - 06:19 PM
31 వీక్షణలు

NYODAY NEWS:  చిట్యాల 

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలలో గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. సెప్టెంబర్ 19వ  వివిఎం ఉద్దీపన పాఠశాలలో జరిగిన నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలో  చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గాధగోని నాగరాజు , గుర్రం చిన్న చెన్నరెడ్డి ఉత్తమ  ప్రతిభను కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న నల్గొండ జిల్లా జట్టు తరఫున జిల్లాస్థాయిలో వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. క్రీడల వల్ల చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెరుగుతుందని. సమయపాలన, వంటి  నియమాలను పాటించే అలవాట్లు మెరుగుపడతాయని అన్నారు. అంతేకాకుండా సహకారం, స్నేహభావం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. శక్తి, వేగం, ఓర్పు, చురుకుదనం,. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సహాయపడతాయని తెలిపారు. అంతేకాకుండా క్రీడా విభాగం లో భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు కూడా సంపాదించుకోవచ్చని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.