BREAKING
thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 04:44 pm
Posted by : SEETHA KIRAN KUMAR

డిసెంబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 04:44 PM
26 వీక్షణలు

అధికారుల ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.. నిబంధనలు పాటించిన వారికి ఆటోమేటిక్‌గా క్యాన్సిలేషన్

న్యూఢిల్లీ: జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియలో 2026 డిసెంబర్ 1 నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఆటోమేటిక్ విధానంలో పూర్తికానుంది. దీంతో రిజిస్ట్రేషన్ రద్దు కోసం జీఎస్టీ అధికారుల ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని, అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు కూడా తగ్గనున్నాయని పేర్కొంటున్నారు.

అయితే, రిజిస్ట్రేషన్ రద్దుకు దరఖాస్తు చేసుకునే వ్యాపారులు కొన్ని తప్పనిసరి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే నాటికి సమర్పించాల్సిన అన్ని జీఎస్టీ రిటర్నులను పూర్తిచేసి ఉండాలి. అలాగే చెల్లించాల్సిన పన్ను బకాయిలతో పాటు వాటిపై విధించిన వడ్డీ, పెనాల్టీలు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా చెల్లించాలి.

ప్రస్తుత జీఎస్టీ నిబంధనల్లో అవసరమైన మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. కొత్త విధానం అమల్లోకి వస్తే నిబంధనలను సక్రమంగా పాటించే పన్ను చెల్లింపుదారులకు రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. సమయం ఆదా కావడంతో పాటు ప్రక్రియలో వేగం, పారదర్శకత పెరిగే అవకాశం ఉంది.