BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 06:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుండ్రెడ్డిపల్లి కోటేశ్వర రెడ్డికి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 06:30 AM
26 వీక్షణలు

మార్కాపురం జిల్లా నుంచి అరుదైన ఘనత.. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల హర్షం

మార్కాపురం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం, కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీ పరిధిలోని గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాట్రెడ్డి కోటేశ్వర రెడ్డి న్యాయశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టా పొందారు. తన పరిశోధనతో ఉన్నత విద్యారంగంలో గుర్తింపు సాధించి స్వగ్రామానికి, కుటుంబానికి గర్వకారణంగా నిలిచారు.

విశ్రాంత ఉపాధ్యాయుడు కాట్రెడ్డి రాజశంకర్ రెడ్డి, లక్ష్మీనారాయణమ్మ దంపతుల కుమారుడైన కోటేశ్వర రెడ్డి న్యాయశాస్త్రంలో మహిళల హక్కులు, నేర చట్టంలో వారి స్థానం, సామాజిక విముక్తి వంటి కీలక అంశాలపై పరిశోధన చేపట్టారు. "ఎనలైజింగ్ ది పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ క్రిమినల్ లా: ఇండియన్ ఉమెన్స్ లిబరేషనిస్ట్ డిస్కషన్" అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనకు గుర్తింపుగా రాజస్థాన్‌లోని అల్వార్ సన్‌రైజ్ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేసింది.

నవంబర్ 18వ తేదీన జరిగిన కార్యక్రమంలో సన్‌రైజ్ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ డాక్టర్ ఎస్. బాలసాహెబ్ గర్జె చేతుల మీదుగా కాట్రెడ్డి కోటేశ్వర రెడ్డి ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. నేర చట్టంలో మహిళల స్థానం, వారికి చట్టపరంగా లభిస్తున్న రక్షణ, మహిళా విముక్తి భావనలపై సాగించిన పరిశోధన ఆయనకు ఈ గుర్తింపును తీసుకొచ్చింది.

గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ సాధించడం పట్ల గుండ్రెడ్డిపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యకు పట్టుదల, కృషి తోడైతే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని కోటేశ్వర రెడ్డి సాధించిన ఘనత నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులు కాట్రెడ్డి రాజశంకర్ రెడ్డి, లక్ష్మీనారాయణమ్మ, చెల్లెలు కే. కోటేశ్వరమ్మ (బీసీ సంక్షేమ వసతి గృహ వార్డెన్), బావ సంగు శ్రీనివాసరెడ్డి, భార్య కే. తులసమ్మ, కుమారులు త్రినాథ్ సుస్రుతేశ్వర రెడ్డి, మోక్షితేశ్వర రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు కోటేశ్వర రెడ్డికి అభినందనలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.