మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
చిట్యాల మండలం: ఉరుమడ్ల గ్రామానికి చెందిన జనపాల లింగస్వామి (50) ఇటీవల ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశంలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో బుధవారం తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి ఉరుమడ్లలోని ఆయన నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా లింగస్వామి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన గుత్తా అమిత్ రెడ్డి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుత్తా దేవేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సోషల్ మీడియా ఇన్‌చార్జి పట్ల జనార్దన్, వార్డు సభ్యులు గంగాపురం రాము, జనపాల శ్రీను, ఎలిమినేటి హరి ప్రసాద్ రెడ్డి, రూపని యాదయ్య, మర్రి రమేష్, సాగర్ల వెంకన్న, మందుగుల జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.