BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 27 August 2026, 01:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్: అర్హత లేకుండానే క్లినిక్‌లు.. 12 మంది నకిలీ వైద్యులు అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 01:10 PM
90 వీక్షణలు

హైదరాబాద్: అర్హత లేకుండానే క్లినిక్‌లు.. 12 మంది నకిలీ వైద్యులు అరెస్ట్

హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. సరైన వైద్య అర్హతలు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ నకిలీ వైద్యులు పట్టుబడ్డారు. ఈ విషయాన్ని టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.

అరెస్టు చేసిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మందులు, సెలైన్ బాటిళ్లు, వైద్య చికిత్సకు ఉపయోగించే సర్జికల్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.