BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 28 September 2026, 09:39 am
Posted by : BOYA SWAMY

పెద్దకాపర్తి బీసీ హాస్టల్‌లో హ్యాపీనెస్ కోర్స్ ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
Reporter
Boya Swamy Chityala Mandal
28 Sep, 2026 - 09:39 AM
23 వీక్షణలు

యోగ, ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపు

చిట్యాల రూరల్, సెప్టెంబర్ 28:

ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు హ్యాపీనెస్ కోర్స్‌లో భాగంగా యోగ, ధ్యాన కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ప్రారంభించారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేయడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగ, ధ్యానం, పద్మ సాధనలు, త్రీ స్టేజ్ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, భస్త్రిక తదితర సాధనలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ ప్రతిరోజూ యోగ, ధ్యానం చేయడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు. ధ్యానం మానవ జీవితంలో ముఖ్యమైన సాధన అని, విద్యార్థులు తమ నిత్యజీవితంలో యోగ, ధ్యానాన్ని భాగం చేసుకోవాలని సూచించారు.

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ సూచించిన సుదర్శన్ క్రియ ద్వారా అంతర్గత శక్తిని గుర్తించడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందేందుకు అవకాశం ఉంటుందని పల్లపు బుద్ధుడు పేర్కొన్నారు. ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనశ్శాంతి, సానుకూల ఆలోచనలు పెంపొందించుకోవచ్చని తెలిపారు. శాంతియుత సమాజం, వసుధైవ కుటుంబం కోసం ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ధర్మపురి తార, ట్యూటర్ బాలు, విద్యార్థులు పాల్గొన్నారు.