BREAKING
thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక
Date of Publish : 30 September 2026, 08:51 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దురుసు ప్రవర్తనపై పోలీసుల వివరాలు ఇవ్వండి డీజీపీకి హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Sep, 2026 - 08:51 AM
11 వీక్షణలు

మహిళా ఎమ్మెల్యేలతో దురుసు ప్రవర్తనపై పోలీసుల వివరాలు ఇవ్వండి డీజీపీకి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 29: మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి, వారి వివరాలను తగిన చర్యల కోసం శాసనసభ స్పీకర్‌ ఎదుట ఉంచాలని డీజీపీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతోపాటు తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ఎల్పీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ ఆదేశాలను సవరించాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేసింది. పోలీసులు స్పీకర్‌ ఆదేశాలను అమలు చేశారని, వారిపై చర్యలు తీసుకుంటే పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.

ఈ అప్లికేషన్‌పై జస్టిస్‌ మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. అసెంబ్లీ ప్రాంగణం లోపల నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుందని స్పష్టం చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి, వారి వివరాలను తగిన చర్యల కోసం స్పీకర్‌ ఎదుట ఉంచాలని డీజీపీని ఆదేశించింది.

అసెంబ్లీ వెలుపల, ముఖ్యంగా అసెంబ్లీలోకి ప్రవేశించే మార్గం వద్ద ఘటన జరిగి ఉంటే.. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను హైకోర్టు ఎదుట సమర్పించాలని డీజీపీకి ధర్మాసనం సూచించింది.