BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:29 pm
Posted by : KOLA MAHESH

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 09:29 PM
13 వీక్షణలు
  • టీవీ, ఇంటి సామగ్రి, రూ.30 వేల నగదు అగ్నికి ఆహుతి
  • ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి

వలిగొండ | ఎన్‌ టుడే న్యూస్‌:

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం నర్సాపురం గ్రామంలో మంగళవారం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. నార్కట్‌పల్లి అనితకు చెందిన ఇంట్లో మంటలు చెలరేగడంతో టీవీతో పాటు ఇంట్లోని వస్తువులు, రూ.30 వేల నగదు కాలిపోయాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ.1.50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు అనిత తెలిపారు. కూలి పనులు చేస్తేనే కుటుంబానికి పూట గడిచే పరిస్థితి ఉందని, అగ్నిప్రమాదంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అగ్నిప్రమాదంతో ఇంట్లోని వస్తువులు, నగదు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అనిత తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం అందించాలని, తమ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని బాధితురాలు విజ్ఞప్తి చేశారు.