అడవి పందిని ఢీకొని ఐకేపీ సీఏ దుర్మరణం
గుల్లకోట స్టేజ్ సమీపంలో అడవి పందిని ఢీకొన్న బైక్
తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి
లక్సెట్టిపేట: మండలంలోని గుల్లకోట స్టేజ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దొడేపల్లి గ్రామానికి చెందిన దుర్గం రాములు (48) మృతి చెందారు. రహదారిపై అకస్మాత్తుగా అడవి పంది అడ్డురావడంతో దానిని తప్పించబోయి బైక్‌తో ఢీకొట్టినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.
దైవదర్శనం నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం రాములు ఐకేపీలో సీఏగా పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్‌కు చెందిన పలువురు ఏజెంట్లతో కలిసి విజయవాడలో దైవదర్శనానికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి తన బైక్‌పై బయలుదేరారు. అనంతరం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో బైక్‌ను పార్క్ చేసి రైలులో విజయవాడకు వెళ్లారు.
దైవదర్శనం ముగించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత రైలులో తిరిగి వచ్చి, తన బైక్‌పై స్వగ్రామమైన దొడేపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో గుల్లకోట స్టేజ్ సమీపంలో రహదారిపై అకస్మాత్తుగా అడవి పంది అడ్డురావడంతో దానిని తప్పించబోయి ఢీకొన్నారు.
తలకు తీవ్ర గాయాలు.. అక్కడికక్కడే మృతి
ప్రమాదంలో బైక్‌పై నుంచి కిందపడిన రాములుకు తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
భార్య సుభాషిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.