BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:33 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ కుటుంబ బీమాతో పేద కుటుంబాలకు భరోసా

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:33 PM
21 వీక్షణలు

అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ లింగ నాయక్

కోయగూడెం గ్రామపంచాయతీలో బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం

బయ్యారం, నవంబర్ 21: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి అకాల మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం నమోదు ప్రక్రియ కోయగూడెం గ్రామపంచాయతీలో ప్రారంభమైంది. శనివారం గ్రామ సర్పంచ్ లింగ నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, పథకానికి అర్హులైన కుటుంబాల వివరాల నమోదు ప్రక్రియను చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ లింగ నాయక్ మాట్లాడుతూ కుటుంబ యజమానిని కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా పరిహారం అందించనుందని తెలిపారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మరణించినప్పుడు ఎదురయ్యే ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు అవసరమైన వివరాలతో గ్రామపంచాయతీ కార్యాలయానికి రావాలని సూచించారు. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలను అందించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో అందిస్తున్న ఈ బీమా సదుపాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. గ్రామంలో అర్హులైన కుటుంబాలన్నీ ఈ పథకం పరిధిలోకి వచ్చేలా నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.