యోగ ధ్యాన మందిరానికి మౌలిక వసతులు కల్పించాలి
NTODAY NEWS: చిట్యాల
ఋషి సంస్కృతి యోగ సేవా కేంద్రం నిత్య సాధన యోగ ధ్యాన మందిరం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిత్య యోగ ధ్యాన సాధకులు చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాలు . నిత్య సాధన యోగ ధ్యాన మందిరం కమిటీ అధ్యక్షుడు మాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాధకులు వినతిపత్రాలు సమర్పించారు. యోగ కేంద్రం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలు అమర్చాలని కోరారు. అలాగే యోగ కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు సాధకుల సంఖ్యకు అనుగుణంగా ప్రస్తుత హాల్ సరిపోవడం లేదని, భవనం విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ యోగ సాధకుల మౌలిక వసతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని సీసీ రోడ్డు, ప్రహరీ గోడ, విద్యుత్ స్తంభాలు, భవనం విస్తరణ తదితర అంశాల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వీలైనంత త్వరగా, ఆరు నెలల్లోగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యోగ సేవా కేంద్రం గౌరవ అధ్యక్షుడు బూరుగు కృష్ణయ్య, ముఖ్య సలహాదారులు నారబోయిన శ్రీనివాస్, కంచర్ల ఈశ్వరయ్య, నీల సత్యనారాయణ, కమిటీ ఉపాధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య, గాదె ఎల్లేష్, కార్యదర్శులు దాడి అరుణ, కోనేటి సాయిరాం, సభ్యులు చెల్లెటి రవీంద్రనాథ్, కుంకుడాల లక్ష్మి, పాలాది రమేష్, పోలా సరోజ, మాస స్వరూప, కాచం శాంతిప్రియ, సిలివేర్ శేఖర్, మందాడి మధుసూదన్‌రెడ్డి, కంది మోహన్‌రెడ్డి, మారగోని రమేష్, పులగం శ్రీనివాస్‌రెడ్డి, చికిలమెట్ల అశోక్, పాల రమేష్, దాసరి బిక్షం తదితరులు పాల్గొన్నారు.