BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 01:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణలో రైతులకు అన్యాయం.. 195 కిలోమీటర్ల రహదారి కోసం వేలాది ఎకరాల భూముల సేకరణకు రంగం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 01:22 PM
21 వీక్షణలు

డీపీఆర్ వెల్లడించకుండా, గ్రామసభలు నిర్వహించకుండా సర్వేలు ఎలా చేస్తారు.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చే వరకు పోరాటం ఆగదు రైతులకు అఖిల భారత కిసాన్ మహాసభ సంపూర్ణ మద్దతు

ఆగిరిపల్లి: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో రైతుల భూములను సేకరించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఐదు జిల్లాల పరిధిలో సుమారు 195 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ఈ రహదారి కోసం భూసేకరణ ప్రక్రియలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ విమర్శించారు. భూసేకరణకు గురయ్యే రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించింది. కంచికచర్ల నుంచి కోలవెన్ను వరకు ఉభయ కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో అమరావతి రాజధాని అవసరాల కోసం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని ప్రతినిధి బృందం పేర్కొంది. అయితే రాజధాని నిర్మాణమే ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత లేని పరిస్థితుల్లో, భవిష్యత్తులో పెరిగే జనాభా అవసరాల పేరుతో ఇప్పటి నుంచే భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. మెగా, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించడం ద్వారా వ్యాపార వర్గాల ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విమర్శించింది. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇప్పటివరకు ప్రజలకు వెల్లడించలేదని, భూములు కోల్పోయే రైతులకు అధికారిక నోటీసులు ఇవ్వలేదని హరినాథ్ ఆరోపించారు. కనీసం గ్రామసభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలోనే గుట్టుచప్పుడు కాకుండా ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లి నుంచి సేకరణ ప్రక్రియ ప్రారంభించడం చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కంచికచర్ల లేదా కోలవెన్ను ప్రాంతాల నుంచి భూసేకరణ ప్రారంభిస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందనే ఉద్దేశంతో మారుమూల గ్రామాల నుంచి ప్రక్రియను ప్రారంభించి ఆగిరిపల్లి వరకు విస్తరిస్తున్నారని ప్రతినిధి బృందం ఆరోపించింది. ఆగిరిపల్లి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో సుమారు 820 ఎకరాల భూమిని సేకరించేందుకు రంగం సిద్ధమైందని తెలిపింది. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే, వారి సమ్మతి తీసుకోకుండానే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సర్వే బృందాలను రంగంలోకి దించి మూడు బృందాలుగా సర్వేలు నిర్వహిస్తోందని, భూముల ఉపవిభజనతో పాటు గుర్తింపు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారని మూడు ఎకరాలకు పైగా భూమిని కోల్పోతున్న ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పాతూరి రవి వెల్లడించారు. ఈ విధమైన చర్యలు రైతులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పూర్తి స్థాయిలో న్యాయమైన నష్టపరిహారం అందేవరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పాతూరి రవి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సవరణలు తీసుకొస్తూ రైతాంగానికి నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆగిరిపల్లి, చిన్న ఆగిరిపల్లి, పిన్నమరెడ్డిపల్లి, గరికపాటివారికండ్రిక, నూగుండపల్లి, కృష్ణవరం, సూరవరం, సగ్గూరు, నర్సింగపాలెం, అమ్మవారిగూడెం గ్రామాల పరిధిలో భూములు సేకరించనున్నట్లు ప్రతినిధి బృందం తెలిపింది. భూములు కోల్పోయే రైతులందరినీ సంఘటితం చేసి, పూర్తి నష్టపరిహారం అందేవరకు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హరినాథ్ హెచ్చరించారు. రైతుల న్యాయమైన పోరాటానికి అఖిల భారత కిసాన్ మహాసభ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని స్పష్టం చేశారు.