BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:46 pm
Posted by : K MAHESH

నిరుపేద కుటుంబాలకు ధీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 06:46 PM
53 వీక్షణలు

సర్వేల్ గ్రామంలో బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

రూ.5 లక్షల బీమా ప్రయోజనాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ చిలకరాజు చందన రాజు

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 21:

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని సర్వేల్ గ్రామ సర్పంచ్ చిలకరాజు చందన రాజు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించి గ్రామంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.

సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో సర్పంచ్ చిలకరాజు చందన రాజు, ఉప సర్పంచ్ కట్కూరి భాస్కర్ గౌడ్, వార్డు సభ్యులు బోయ చందు, ఈసం సరిత కిరణ్, గోరటి శివశంకర్, సిలివేరు సువర్ణ గాలయ్య, ఎల్లంకి శైలజ నరేష్, గడ్డమీది రమాదేవి నరసింహ పాల్గొని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చిలకరాజు చందన రాజు మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గతంలో పేదలకు భూములు పంపిణీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం కుటుంబ యజమాని మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా బీమా భరోసా కల్పించే కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఇది పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

ఈ పథకం ద్వారా అర్హులైన నిరుపేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ప్రయోజనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడంలో ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి సహకరించాలని సర్పంచ్ కోరారు.