BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 04:04 pm
Posted by : PEDDABOINA SRIKANTH

విద్యార్థి కార్తీక్ మృతిపై న్యాయం చేయాలి: తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
21 Nov, 2026 - 04:04 PM
18 వీక్షణలు

విద్యార్థి సంఘాల నాయకులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

వరంగల్: శ్రీ చైతన్య బొంగులూరు క్యాంపస్‌లో ఎస్. కార్తీక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు లాఠీచార్జి చేశారని ఆ సంఘం నాయకులు ఆరోపించారు.

ఈ ఘటనలో ఏసీపీ ప్రదీప్ కుమార్, మాలధారణలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తుడిపై కూడా దాడి చేయించారని వారు ఆరోపించారు. విద్యార్థి మృతికి సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు.

మృతుడి కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థి సంఘాల నాయకులపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలను వెంటనే సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ అంశాలపై గ్రేటర్ వరంగల్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడారు.

ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌వీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సుతేజ్‌తో పాటు మహీధర్, గణేష్, మణి వరుణ్, అరుణ్ సాయి, ఉమేష్, అభినయ్, వంశీ, సాయి రక్షిత్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.