BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 08 October 2026, 08:21 am
Posted by : MOOLA RAJENDRA REDDY

కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం..

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
08 Oct, 2026 - 08:21 AM
8 వీక్షణలు

కొండలను తొలగిస్తూ కొత్త అలైన్‌మెంట్ నిర్మాణం

కడప: కడప నుంచి రాజంపేట వైపు వెళ్లే మార్గంలో కడప-రేణిగుంట జాతీయ రహదారి-716 నాలుగు లైన్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో కొండలను తొలగిస్తూ భారీగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు.

సుమారు 121.9 కిలోమీటర్ల మేర రెండు ప్యాకేజీలుగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రూ.2,250 కోట్లకు పైగా వ్యయం అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో పాత రోడ్డును కేవలం విస్తరించడమే కాకుండా.. అవసరమైన ప్రాంతాల్లో కొత్త అలైన్‌మెంట్‌ ద్వారా నాలుగు లైన్ల హైవేను నిర్మిస్తున్నారు. ఇందుకోసం కొండలు, భౌగోళిక అడ్డంకులను తొలగిస్తూ రహదారి మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.

అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా ప్రాజెక్టు పనుల్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ప్రస్తుతం పనులు వేగం పుంజుకున్నాయి. 2028 మార్చి నాటికి నిర్మాణ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

హైవే నిర్మాణం పూర్తయితే కడప నుంచి రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతి వైపు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఈ మార్గం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.