నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ
తెలంగాణ
/
తెలంగాణ
/
నల్గొండ
నారాయణపురం: మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుడు కట్టెల లింగస్వామి రచించిన ‘కలం కవాతు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నారాయణపురం మండలంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం ముఖ్య అతిథులుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పుస్తక రచయిత కట్టెల లింగస్వామిని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్ కాశీం అభినందించారు. సమాజంలోని సమస్యలు, ప్రజల జీవన పరిస్థితులు, సామాజిక పరిణామాలను అక్షరాల ద్వారా ప్రతిబింబించే రచనలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
సామాజిక అంశాలను సాహిత్య రూపంలో ప్రజలకు చేరువ చేయడం ద్వారా సమాజంలోని సమస్యలపై చర్చకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. పుస్తక రచయిత లింగస్వామి సామాజిక అంశాలను తన రచనల ద్వారా ప్రస్తావించడం అభినందనీయమన్నారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, మాజీ విద్యార్థి ఉద్యమ నాయకులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.