కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కొప్పుల చిత్రపటాలకు పాలాభిషేకం
కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కొప్పుల చిత్రపటాలకు పాలాభిషేకం
వెల్గటూర్: అక్టోబర్ 2 ఎన్ టుడే న్యూస్
వెల్గటూర్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు శనివారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ధర్మపురి ధర్మరాజు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ల చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ... నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం ఎంతో మంది పేద కుటుంబాలకు కొండంత అండగా నిలిచిందని కొనియాడారు. పథకం ప్రారంభించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.