కనిగిరి పోస్టాఫీసులో కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదం బుకింగ్ సదుపాయం
ఆంధ్రప్రదేశ్
కనిగిరి: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి లడ్డూ ప్రసాదం బుకింగ్ సదుపాయం కనిగిరి పోస్టాఫీసులో అందుబాటులో ఉందని మార్కాపురం పోస్టల్ సూపరింటెండెంట్ జి.వి. శ్రీనివాసులు తెలిపారు.
దేవి నవరాత్రుల సందర్భంగా భక్తులకు ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పోస్టాఫీసులో బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు రూ.116 చెల్లించి సాయంత్రం 4 గంటలలోపు లడ్డూ ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
బుక్ చేసుకున్న ప్రసాదాన్ని దేవి నవరాత్రుల సందర్భంగా కనిగిరి ప్రాంత ప్రజలకు అందజేయనున్నట్లు తెలిపారు. అమ్మవారి భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కనిగిరి సబ్ పోస్టుమాస్టర్ కె. సాయిరామ్ కోరారు.