ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి
ఉరుమడ్ల: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కాలనీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం లోకమాత యువసేన ఆధ్వర్యంలో ఎస్‌బీఐ బ్యాంకు పక్కన ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉరుమడ్ల గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల జెడ్పీటీసీ సుంకరి యాదగిరి గౌడ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉయ్యాల నాగరాజు గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆవుల నర్సింహ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకరబోయిన (పెద్ద) నరసింహ, ఉయ్యాల భాస్కర్, శేఖర్, శివకుమార్, భరత్, బోయ సైదులు, వంశీ, శివ, కొండా శివ, అనగంటి నరేష్, ఐతరాజు నాగరాజు, మాదగోని వినయ్, ఐతరాజు శివ, బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు జన్నపాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.