దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే
అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలి: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 7 (ఎన్‌టుడే న్యూస్): దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి వారి అభ్యున్నతికి కృషి చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
నాగోల్ డివిజన్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధు పథకం ద్వారా మరింత మంది అర్హులైన దళితులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని సుధీర్‌రెడ్డి తెలిపారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా దళితులను మోసం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో దళితులు ఐక్యంగా ముందుకు సాగుతున్నారని, తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుధీర్‌రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు గోల్కొండ మైసయ్య, మల్లెపాక యాదగిరి, ఉమామహేశ్వర్, పార్షపు శ్రీధర్, మద్దెల నర్సింహ, రుద్రల స్వామి, కడారి పెంటయ్య, రెడ్డి మాల పెద్ద కృష్ణ, స్కైలాబ్, కోదండ సురేష్, కొత్తపేట ప్రభాకర్, రాజేందర్, దప్పు వినోద్, కటేపక రవి, చెంగల్ చంద్ర మోహన్, కొంగర మహేష్, గౌరీశంకర్, సంగిపేట నరేష్, గోపి మధు, జలేందర్, నరేష్, శ్రీనివాస్, ఏర్పుల గాలయ్య, ఏర్పుల యాదయ్యతో పాటు మహిళా నాయకులు అనిత, పద్మ, విజయలక్ష్మి, నిర్మల, జ్యోతి, రేణుక, లక్ష్మి, కల్పన తదితరులు పాల్గొన్నారు.